Mamidikuduru: గణేష్ నిమజ్జనంలో విషాదం.. కరెంటు షాక్‌తో యువకుడు మృతి!

Mamidikuduru: కోనసీమ: మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో గణేష్ నిమజ్జనం వేళ డీజే వాహనం విద్యుత్ తీగలకు తగిలి షాక్‌తో యువకుడు మృతి; ఇద్దరికి తీవ్ర గాయాలు.

PRABHU, RAZOLE
Published on: 24 Sept 2026 11:50 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: గణేష్ నిమజ్జనంలో విషాదం.. కరెంటు షాక్‌తో యువకుడు మృతి!

Mamidikuduru: బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌కు గురై ముమ్మిడివరం మండలం అయినాపురానికి చెందిన ఇళ్ల సాయిచందు (25) మృతి చెందాడు. ఈ ఘటనలో అల్లవరం మండలానికి చెందిన బడుగు దుర్గాప్రసాద్, పంపాని శివశంకర్ తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా డీజే వాహనంపై కప్పిన బరకం 11 కేవీ విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, ట్రాక్టర్‌పై ఉన్నవారు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో సాయిచందు అక్కడికక్కడే మృత్యువాత పడగా, దుర్గాప్రసాద్, శివశంకర్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE