Koonavaram: కూనవరం ZPTC సమరం: బీజేపీ ప్రచార రథం ప్రారంభం!
Koonavaram: కూనవరంలో NDA బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి పాయం వెంకయ్య ప్రచార రథాన్ని సోడే మధుసూదన్ రావు ప్రారంభించి, కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు.
Koonavaram: కూనవరం ZPTC సమరం: బీజేపీ ప్రచార రథం ప్రారంభం!
Koonavaram: కూటమి తరుపున కూనవరం జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిజెపి నాయకులు పాయం వెంకయ్యను గెలిపించాలి అని బిజెపి రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి సోడే మధుసూదన్ రావు పిలుపునిచ్చారు.మండలంలోని బొజ్జరాయిగూడెం గ్రామంలో పార్టీ ప్రచార రథాన్ని సోడే మధుసూదన్ రావు,ధనలక్ష్మి దంపతులు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీలు బలపర్చిన భారతీయ జనతా పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి పాయం వెంకయ్య గెలుపుకు కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.కూనవరం మండలంలో పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పాయం వెంకయ్య ఎంతగానో కృషి చేశారని అన్నారు.
రాజకీయంగా అనుభవం ఉన్న వెంకయ్యను గెలిపిస్తే మండలం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.జడ్పిటిసిగా పాయం వెంకయ్య ను గెలిపిస్తే కూటమి ప్రభుత్వం తరుపున మండలానికి అధిక నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేస్తామని అన్నారు.ఓటర్ మహాశ్రయులు బిజెపి పార్టీకి అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో పాయం వెంకయ్యను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మోసం జయమ్మ, రాము,సోడే వీరభద్రం,మీడియం రమేష్, పైద రాజు, కుంజా వెంకట్, సోడే రామయ్య,కారం ధారయ్య,బొర్రా కామేశ్వరి, ఉయిక రత్తయ్య,బొగ్గ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.




