Atreyapuram: కొత్తపేట, ఆత్రేయపురం YCP ZPTC అభ్యర్థులు!
Atreyapuram: కోనసీమ కొత్తపేట జడ్పీటీసీ అభ్యర్థిగా బండారు సత్తిరాజు, ఆత్రేయపురం జడ్పీటీసీగా కప్పల శ్రీధర్‌లను YSRCP జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ప్రకటించారు.
Atreyapuram: కొత్తపేట, ఆత్రేయపురం YCP ZPTC అభ్యర్థులు!
Atreyapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని కొత్తపేట మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా వానపల్లి గ్రామానికి చెందిన బండారు సత్తిరాజు (రాజా) ను మరియు ఆత్రేయపురం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా ర్యాలి గ్రామానికి చెందిన కప్పల శ్రీధర్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రకటించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులందరూ అభ్యర్థులకు అండగా నిలిచి, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు.




