Kothapeta: ఘనంగా 'చెప్పాం.. చేస్తున్నాం' ప్రచార కార్యక్రమం ప్రారంభం!

Kothapeta: ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు వానపల్లిలో చెప్పాం చేస్తున్నాం పోస్టర్ ఆవిష్కరించారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 20 Oct 2026 12:53 PM IST
Kothapeta
X

Kothapeta: ఘనంగా 'చెప్పాం.. చేస్తున్నాం' ప్రచార కార్యక్రమం ప్రారంభం!

Kothapeta: ఎన్నికల ముందు అభివృద్ధి, సంక్షేమం కోసం ఏం చెప్పామో, అదే ఇప్పుడు చేసి చూపిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో చెప్పాం…చేస్తున్నాం… కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 19 నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్న చెప్పాం.. చేస్తున్నాం..క్షేత్రస్థాయి ప్రచార కార్యక్రమాన్ని కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోస్టర్ ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట ఇచ్చాం..నిలబెట్టుకుంటున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తుందన్నారు.

ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కీలక హామీలను నెరవేర్చాలన్నారు. ఇదే కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నియోజకవర్గ పరిధిలో ఈరోజు నుండి ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ ప్రారంభించామన్నారు. ఈ స్థానిక ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మై టీడీపీ యాప్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మిగిలిన హామీలను కూడా నెరవేర్చి మెరుగైన ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే భరోసాను ప్రజలకు కల్పించడమే ఈ "చెప్పాం.. చేస్తున్నాం" ప్రచారం ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA