Kothapeta: కొత్తపేటలో కొత్తగా 73 స్పౌజ్ పింఛన్ల పంపిణీ ప్రారంభం!

Kothapeta: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం వాడపాలెంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 1 July 2026 10:19 AM IST
Kothapeta
X

Kothapeta: కొత్తపేటలో కొత్తగా 73 స్పౌజ్ పింఛన్ల పంపిణీ ప్రారంభం!

Kothapeta: పింఛన్ల పంపిణీలో దేశంలోనే ఆదర్శ విధానం అమల్లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.బుధవారం వాడపాలెంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో దేశంలోనే అత్యధిక పింఛన్ మొత్తం అందిస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అన్నారు.

నియోజకవర్గంలో నేటి నుంచి కొత్తగా స్పౌజ్ కేటగిరీలో 73 పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు.ఎన్డీఏ కూటమి పాలన వచ్చాక 60 వేల కోట్ల రూపాయలు పింఛన్ల పంపిణీ కోసం ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఒకటో తేదీన సెలవు ఉంటే 31వ తేదీనే పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. కొత్తవారికి అర్హులకు రాబోయే రోజుల్లో నూతనంగా పింఛన్లు అందిస్తామన్నారు.

గత వైసిపి ప్రభుత్వం లో వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి ఐదేళ్ల కాలం తీసుకున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేల పింఛన్ ను రూ.4వేలకు, అలాగే వికలాంగులకు రూ.6వేలు, బెడ్ రెస్ట్ పేషెంట్లకు రూ.15వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అర్హులందరికీ నూతన పింఛన్లు అందించడానికి త్వరలోనే కార్యాచరణ మొదలవుతుందన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA

Next Story