Kothapeta: రావులపాలెంలో చరిత్ర సృష్టించిన టీడీపీ.. జడ్పీటీసీ, ఎంపీపీ క్లీన్ స్వీప్!

Kothapeta: కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో చరిత్ర సృష్టించిన టీడీపీ. 1988 తర్వాత తొలిసారి జడ్పీటీసీ, ఎంపీపీ పీఠాలను దక్కించుకున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 8 Nov 2026 1:30 PM IST
Kothapeta
X

Kothapeta: రావులపాలెంలో చరిత్ర సృష్టించిన టీడీపీ.. జడ్పీటీసీ, ఎంపీపీ క్లీన్ స్వీప్!

Kothapeta: కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు మండలాలు కలిసి ఉంది. ఇందులో రావులపాలెం మండలం జడ్పిటిసి, మండల ప్రజా పరిషత్ 1988 నుండి ఎప్పుడు చరిత్రలో తెలుగుదేశం కు మండల ప్రజా పరిషత్ దక్కించుకోలేదు. ఈసారి జడ్పిటిసి ఎంపీపీ రెండు ఒకేసారి తెలుగుదేశం ఖాతాలో రావటం చరిత్రని చెప్పవచ్చు. 19 88 నుండి మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి ఎంపీపీ చేక్కించుకుంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈసారి రాజకీయ ఎత్తుగడ మార్చి ఎన్నికలకు సరికొత్త ప్రయోగం చేశారని చెప్పొచ్చు.

జడ్పిటిసి ఒక సామాజిక వర్గానికి ఇవ్వటంతో ఆ సామాజిక వర్గం ఆర్థికపరమైన బలమైన వ్యక్తి కావడంతో బండారు సత్యానందరావు రాజకీయ ఎత్తుగడ పలిచిందనే చెప్పొచ్చు దీంతో ఎంపిటిసి స్థానాలు అధికంగా ఎన్నిక కావడం తో ఎంపీపీ తెలుగుదేశం మెజారిటీ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. దీంతో ఎంపీపీ అధ్యక్ష పదవి కూడా తెలుగుదేశం ఖాతాలోనే జమ అయ్యింది.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA