Kothapeta: వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

Kothapeta: కొత్తపేటలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, పరిశీలకులు పాటి శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.

TRIMURTULU, KOTHAPETA
Published on: 17 Sept 2026 6:16 AM IST
Kothapeta
X

Kothapeta: వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

కొత్తపేట: కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

అనంతరం జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి చేతుల మీదుగా నియోజకవర్గంలో రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, మండల పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు ఐడెంటిటీ కార్డులను అందజేశారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తను గుర్తిస్తూ వారికి బాధ్యతలు అప్పగించి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు.

ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి, వెన్నుపోటు రాజకీయాలు మరియు పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రతి గడపకు తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత ఉధృతం చేసి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA