Kothapeta: కూటమి అభ్యర్థులను గెలిపించండి: జడ్పీ వైస్ ఛైర్మన్ రామకృష్ణ!

Kothapeta: గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ యెలిశెట్టి రామకృష్ణ (చిన్న) ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 27 Nov 2026 2:32 PM IST
Kothapeta
X

Kothapeta: కూటమి అభ్యర్థులను గెలిపించండి: జడ్పీ వైస్ ఛైర్మన్ రామకృష్ణ!

కొత్తపేట: గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ యెలిశెట్టి రామకృష్ణ (చిన్న) ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలంటే ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థులను గెలిపించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల తీర్పుతో గ్రామాల్లో అభివృద్ధి పథం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA