Antarvedi: వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి శాంతి కళ్యాణం!

Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో బహుళ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 11 July 2026 11:26 PM IST
Antarvedi
X

Antarvedi: వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి శాంతి కళ్యాణం!

అంతర్వేది: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో బహుళ ద్వాదశి సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు.

వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పాణిగ్రహణం, మాంగల్యధారణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆచార్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story