Amalapuram: అమలాపురంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 700 మట్టి వినాయకుల పంపిణీ!

Amalapuram: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 700 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 13 Sept 2026 4:39 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 700 మట్టి వినాయకుల పంపిణీ!

అమలాపురం: పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం సేవాభావం సుమారుగా 700 మట్టి వినాయక ప్రతిమల ఉచితంగా పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం ఆధ్వర్యంలో భక్తులకు సుమారుగా 700 మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

“మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రీజియన్ చైర్‌పర్సన్ లయన్ జంపన సుమన్ వర్మ, MJF, ప్రత్యేక అతిథిగా జోన్ చైర్‌పర్సన్ లయన్ రవణం వేణుగోపాల రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి వినాయకుడినే పూజించాలని పిలుపునిచ్చారు. ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.పెద్ద సంఖ్యలో భక్తులు శిబిరానికి చేరుకుని మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా స్వీకరించారు.పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా…

సేవే మా సంకల్పంగా…

మట్టి వినాయకుడిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం..ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం అధ్యక్షుడు లయన్ మద్దెల వెంకటేశ్వరరావు, లయన్ గుర్రం రామకృష్ణ,లయన్ సత్యనారాయణమూర్తి (సత్తిపండు), లయన్ సుధా గణపతి,లయన్ చిక్కాల సతీష్,లయన్ తాతయ్య కాపు,లయన్ వరదా రాంబాబు,లయన్ నంబూరి శ్రీనివాసరావు,లయన్ సుగ్గు గోపి తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM