Razole: రాజోలు నియోజకవర్గంలో మొదలైన స్థానిక ఎన్నికల కోలాహలం!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.

PRABHU, RAZOLE
Published on: 21 Oct 2026 11:29 AM IST
Razole
X

Razole: రాజోలు నియోజకవర్గంలో మొదలైన స్థానిక ఎన్నికల కోలాహలం!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ఎన్నికల (ఎంపీటీసీ /జెడ్పీటీసీ) సందడి మొదలైంది. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాల వద్ద నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సహకరించాలని వారు సూచించారు

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE