I Polavaram: ఐ.పోలవరంలో పిచ్చికుక్క స్వైరవిహారం 10 పశువులకు గాయాలు!
I Polavaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలో పిచ్చికుక్క స్వైరవిహారం 10 పాడి పశువులు, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు.
I Polavaram: ఐ.పోలవరంలో పిచ్చికుక్క స్వైరవిహారం 10 పశువులకు గాయాలు!
I Polavaram: ఐ. పోలవరం మండలంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఓ పిచ్చికుక్క రెచ్చిపోయి పాడి పశువులు, వ్యక్తులపై దాడి చేసింది. ఈ దాడిలో మొత్తం పది పాడి పశువులు, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
ఐ. పోలవరం ప్రాంతంలో ఎనిమిది పాడి గేదెలపై, కేశనకూరులో రెండు పాడి గేదెలతో పాటు ఇద్దరు వ్యక్తులపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది.
అకస్మాత్తుగా పిచ్చికుక్క దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కుక్కను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ, తొలుత వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
కుక్క దాడిలో గాయపడిన ఇద్దరు వ్యక్తులకు టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక దాడిలో గాయపడిన పాడి పశువులకు కూడా తక్షణమే వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అదేవిధంగా గ్రామాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి రేబిస్ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని, ప్రజలు మరియు పాడి పశువులకు రక్షణ కల్పించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.




