Malikipuram: మలికిపురం డెంగీ, మలేరియాపై అవగాహన సదస్సు

Malikipuram: మలికిపురంలో డెంగీ మాసోత్సవాల అవగాహన కార్యక్రమం. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచన. ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE
Published on: 17 July 2026 8:40 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురం డెంగీ, మలేరియాపై అవగాహన సదస్సు

మలికిపురం: డెంగీ మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం మలికిపురం లోని ముసుగు తోట ప్రాంతంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ, ఫైలేరియా వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, ఇంటి ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పూల కుండీలు, రుబ్బురోలు, పాత టైర్లు, పాత ప్లాస్టిక్ సామగ్రి, తాగి పడేసిన కొబ్బరి బొండాలు తదితర వస్తువుల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల వారానికి ఒకసారి వాటిని పరిశీలించి నీటిని తొలగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇళ్ల వెంకటరమణ, ఏఎన్‌ఎంలు అప్పారి సూర్య నాగమణి, ప్రశాంతి, ఆశా కార్యకర్తలు ఆర్. నాగమణి, వెంకటలక్ష్మి మరియు మోరి వైద్య సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story