Malikipuram: మండలంలో రూ.4.82 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
Malikipuram: మలికిపురం మండలంలో SASCI నిధులతో రూ.4.82 కోట్ల విలువైన పలు రోడ్ల నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు.
Malikipuram: మండలంలో రూ.4.82 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
మలికిపురం: మలికిపురం మండలంలో SASCI నిధులతో చేపట్టనున్న రూ.4.82 కోట్ల విలువైన పలు రోడ్ల నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
విశ్వేశ్వరాయపురం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కేర్ హాస్పిటల్ ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు చినబూరిగ మీదుగా 1.200 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.81 లక్షలు మంజూరయ్యాయి. చినబూరిగ వంతెన వద్ద ఎమ్మెల్యే పనులకు శంకుస్థాపన చేశారు.
లక్కవరం–గుబ్బలపాలెం పంచాయతీరాజ్ రోడ్డు నుంచి ఇరుసుమండ ఆదర్శనగర్ వరకు 1.529 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.08 కోట్లు, లక్కవరం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గుబ్బలపాలెం ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు 1.457 కిలోమీటర్ల సీసీ రోడ్డుకు రూ.1.24 కోట్లు వ్యయం చేయనున్నారు. ఇరుసుమండ గ్రామంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగింది.
బట్టేలంక హైస్కూల్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఇరుసుమండ–అడవిపాలెం ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు 0.890 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.63 లక్షలు కేటాయించారు. అడవిపాలెం సాలిపేట ఎంట్రన్స్ వద్ద పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేశారు.
గూడపల్లి సినిమాహాల్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి పోలమూరి వారి కాలనీ వరకు 1.686 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1.06 కోట్లు కేటాయించారు. గూడపల్లి సినిమాహాల్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయి. రైతులు, విద్యార్థులు, కార్మికులు, వీవర్స్ కాలనీల ప్రజలకు రహదారి సౌకర్యం మెరుగుపడి ప్రయోజనం కలగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ పనులను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.




