Malikipuram: బట్టేలంకలో ఓఎన్జీసీ భారీ వాహనంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్

Malikipuram: మలికిపురం మండలం బట్టేలంకలో ఓఎన్జీసీ భారీ వాహనం ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

PRABHU, RAZOLE
Published on: 2 Oct 2026 9:23 PM IST
Malikipuram
X

Malikipuram: బట్టేలంకలో ఓఎన్జీసీ భారీ వాహనంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్

మలికిపురం: ఓఎన్జీసీకి చెందిన భారీ వాహనం కారణంగా మలికిపురం మండలం బట్టేలంకలోని గాంధీ బొమ్మల సెంటర్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 60 అడుగుల పొడవు, 100 టన్నుల బరువుతో ఉన్న భారీ వాహనం ఇరుకైన మార్గంలో ప్రయాణించడంతో మధ్యలో చిక్కుకుపోయింది.

భారీ వాహనం రాకతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. భారీ వాహనాల రాకపోకలకు సంబంధించి అవసరమైన అనుమతులు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా అనే అంశంపై అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

వెంటనే సంబంధిత అధికారులు స్పందించి భారీ వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE