Malikipuram: తుఫాన్ బాధితులకు రెడ్‌క్రాస్ చేయూత

Malikipuram: మలికిపురం మండలం బట్టేలంకలో తుఫాన్ బాధితులకు టార్పాలిన్లు పంపిణీ చేసిన రెడ్‌క్రాస్ సభ్యులు. నిరాశ్రయులైన మహిళకు ఆర్థిక సాయం అందించిన బుజ్జి రాజు.

PRABHU, RAZOLE
Published on: 4 Nov 2026 8:45 PM IST
Malikipuram
X

Malikipuram: తుఫాన్ బాధితులకు రెడ్‌క్రాస్ చేయూత

మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం బట్టేలంక గ్రామంలో తుఫాన్ కారణంగా ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన మూడు కుటుంబాలకు రెడ్‌క్రాస్ సభ్యులు అండగా నిలిచారు. జంపన బుజ్జి రాజు చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు టార్పాలిన్లు (బరకాలు) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఇల్లు కోల్పోయిన మతిస్థిమితం లేని బాలిక తల్లి ఊటాడ సీత పరిస్థితిని చూసి చలించిపోయిన జంపన బుజ్జి రాజు, ఆమెకు టార్పాలిన్‌తో పాటు వ్యక్తిగతంగా రూ.1,000 ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు అల్లూరి మధురామరాజు, మంగెన వెంకట నరసింహారావు, మంగెన మురళీకృష్ణ, బోనం రాజు, బోనం సూర్యప్రకాష్, బోనం బుజ్జి తదితరులతో పాటు వాలంటీర్లు ఆవుపాటి సుబ్రహ్మణ్యం, సాగి వర్మ, బోనం తాతారావు, కళ్యాణ్, ఏసుబాబు, రాఘవులు, అర్జునరావు, దొరబాబు, సత్యనారాయణ, లక్కు శ్రీను, బండారు భాస్కర్, బండారు రాము, యడ్ల బాబూజీ, లకుం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచి సహాయం అందించిన రెడ్‌క్రాస్ సభ్యులను స్థానికులు అభినందించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE