Malikipuram: మలికిపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన గొల్లపల్లి అమూల్య

Malikipuram: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ మలికిపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య.

PRABHU, RAZOLE
Published on: 4 Aug 2026 9:23 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన గొల్లపల్లి అమూల్య

మలికిపురం: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంగళవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, మలికిపురం గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించి గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక సమస్యలు, మౌలిక వసతులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకు సాగుతోందన్నారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి వంటి అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడమే ఇంటింటి ప్రచారం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ వారి సమస్యల పరిష్కారానికి వారధిగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పిన్నమరాజు శ్రీనివాసరాజు, మండల పార్టీ అధ్యక్షుడు అడబాల సాయిబాబా, గోనిపాటి రాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ కాకి లక్ష్మణ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story