Mamidikuduru: దీప్తి పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!
Mamidikuduru: మామిడికుదురు దీప్తి పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణతో ఉట్టి కొట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు.
Mamidikuduru: దీప్తి పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!
Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు స్థానిక దీప్తి పాఠశాలలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేస్తూ అందరినీ అలరించారు.
అనంతరం విద్యార్థులు ఉట్టి కొట్టి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు యక్కలదేవర నాగన్నబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story




