Mamidikuduru: భారీ అగ్నిప్రమాదం: తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధం!

Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గాలిదేవరపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తాటాకు ఇల్లు దగ్ధమైంది.

PRABHU, RAZOLE
Published on: 21 July 2026 4:27 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: భారీ అగ్నిప్రమాదం: తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధం!

మామిడికుదురు: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు శివారు గాలిదేవరపాలెంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంటి యజమాని సత్యవతి కుటుంబ సభ్యులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.

స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా, రాజోలు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే అప్పటికే ఇంట్లోని గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబం సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది.

అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్‌నే కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story