Razole: గ్యాస్ లీక్ ఘటనలో కాలిన గాయాలతో యువతి మృతి

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

PRABHU, RAZOLE
Published on: 17 Jun 2026 11:18 AM IST
Razole
X

Razole: గ్యాస్ లీక్ ఘటనలో కాలిన గాయాలతో యువతి మృతి

రాజోలు: డాక్టర్. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వంట గ్యాస్ లీక్ కారణంగా తీవ్రంగా కాలిన గాయాలకు గురైన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది.

గ్రామానికి చెందిన చుట్టుగుళ్ల చంద్రప్రియ (23) ఈ నెల 14వ తేదీన ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆమెకు దాదాపు 100 శాతం కాలిన గాయాలు అయ్యాయి.

తీవ్ర గాయాలతో ఆమెను కుటుంబ సభ్యులు రాజోలు ఏరియా ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మూడు రోజులుగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న చంద్రప్రియ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది.

యువతి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story