Mamidikuduru: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు
Mamidikuduru: మామిడికుదురు మండలంలో భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు. ఘనంగా 'షబే ఆషూరా' మాతం ఊరేగింపు.
Mamidikuduru: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు
మామిడికుదురు: మానవత్వం, న్యాయం, ధర్మం కోసం తన ప్రాణాలను అర్పించిన మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమామ్ హుస్సేన్ నేటికీ ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని మత ప్రబోధకులు మహమ్మద్ కాజ్మీ నజఫి అన్నారు. 61వ హిజ్రీ సంవత్సరంలో జరిగిన కర్బలా ఘటన మానవత్వ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
మామిడికుదురు మండలం మామిడికుదురు నగరం గ్రామాలలో మొహరం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 1448 సంవత్సరాల క్రితం జరిగిన కర్బలా సంఘటన ఇప్పటికీ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉందన్నారు. మొహరం పదో రోజును "ఆషూరా"గా స్మరించుకుంటారని తెలిపారు.
ఆషూరాకు ముందు రాత్రి నిర్వహించే "షబే ఆషూరా" కార్యక్రమంలో భాగంగా పీర్లు, గుమ్మటాలతో భక్తులు మాతం నిర్వహిస్తూ ఊరేగింపులు చేపట్టారు. అనంతరం జరిగిన మాతం కార్యక్రమం తర్వాత ఇమామ్ హుస్సేన్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు భక్తులు ఘనంగా నివాళులర్పించారు.




