Mamidikuduru: పాళమ్మ తల్లి ఆలయంలో వైభవంగా ఆషాఢ మాస పూజలు!
Mamidikuduru: మాకనపాలెంలో శ్రీ పాళమ్మ తల్లికి శాకాంబరి దేవి అలంకరణ. ఆషాఢ మాస సందర్భంగా మేళతాళాలతో గ్రామోత్సవంగా వచ్చి సారే సమర్పించిన భక్త మహిళలు.
Mamidikuduru: పాళమ్మ తల్లి ఆలయంలో వైభవంగా ఆషాఢ మాస పూజలు!
మామిడికుదురు: మామిడికుదురు మండలం మాకనపాలెం గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పాళమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవి అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించగా, ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
అనంతరం గ్రామ ఆడపడుచులు డోలు, సన్నాయి మేళాల నడుమ గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని, పసుపు, కుంకుమ, చీర, రవికలు, చలివిడి, బెల్లం, వడపప్పు, పానకాలు, వివిధ రకాల పిండివంటలతో అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారే సమర్పించారు. ఈ వేడుకలు భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలగలిపిన వాతావరణంలో అత్యంత వైభవంగా సాగాయి.
అనంతరం భక్త మహిళల ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాకనపాలెం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు.




