Mamidikuduru: మామిడికుదురు అగ్నిప్రమాదంలో దగ్ధమైన తాటాకు ఇల్లు
Mamidikuduru: మామిడికుదురులో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన వృద్ధురాలు భాస్కరమ్మ. తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధం. దాతల సాయం కోసం ఎదురుచూపులు.
Mamidikuduru: మామిడికుదురు అగ్నిప్రమాదంలో దగ్ధమైన తాటాకు ఇల్లు
మామిడికుదురు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, మామిడికుదురు ఆల్ కాస్ట్ కాలనీలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో తుమ్మిడి భాస్కరమ్మకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న భాస్కరమ్మ తన సర్వస్వాన్ని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలింది. సమాచారం అందుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
వంట చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసిపడి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. బాధితురాలిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు.
Next Story




