Rajahmundry: ఓటర్ల సవరణపై వైసీపీ శ్రేణులకు మార్గాని భరత్ కీలక ఆదేశాలు!

Rajahmundry: రాజమహేంద్రవరంలో ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అప్రమత్తం చేశారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 17 Jun 2026 7:07 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఓటర్ల సవరణపై వైసీపీ శ్రేణులకు మార్గాని భరత్ కీలక ఆదేశాలు!

రాజముండ్రి: ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ ( సర్) రాజమహేంద్రవరం నగరంలోని ప్రారంభమైందని వైసిపి కేడరు నాయకులు, వార్డు ఇన్చార్జీలు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ కోరారు. పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు, వార్డు ఇన్చార్జిలు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో భరత్ సర్ కార్యక్రమం పట్ల అప్రమత్తంగాచేస్తూ , ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు ఉండేలా చూడడం, ముఖ్యంగా వైసిపి పార్టీ సానుభూతిపరుల, మద్దతు ధారుల ఓట్లు గల్లంతూ కాకుండా ఓటర్ జాబితాలను దగ్గర పెట్టుకొని పార్టీ కేడరు బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తుండలన్నారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు కొల్లగొట్టడానికి అవాంచిత యాప్ వినియోగిస్తున్నట్లు తెలుస్తుందని తమ పార్టీ ఓట్లు పోకుండా పార్టీ క్యాడర్ నాయకులు, బిఎల్ఎలు ప్రభుత్వ ( బి ఎల్ ఓ) అధికారులతో మిగతా పార్టీ వాళ్ళతో కలిసి పనిచేయాలని సూచించారు.

ఇంతవరకు పార్టీ చేసిన కార్యక్రమాలు ఒకే ఎత్తు కాగా, ముఖ్యంగా ఈ కార్యక్రమం మరొక ఎత్తు అని, రెండు వారాలు పాటు పార్టీ క్యాడర్ బూత్ లెవల్ ఏజెంట్లు , వార్డు ఇన్చార్జీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్ ప్రక్రియలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ లెవెల్ అధికారులు పూర్తిచేసిన కొత్త ఓట్లు నమోదు, సేకరించిన వివరాలను, సమాచారాన్ని వైసీపీ క్యాడర్ సమీకరించాలని, రికార్డు చేయాలని బి ఎల్ ఓ అధికారుల నుంచి రిసీట్లు తీసుకోవాలని భద్రపరచాలని, ఈ ప్రక్రియ మొత్తంలో అప్రమత్తంగా ఉండాలని మరోసారి కేడర్ కు సూచించారు.

ఈ సమావేశంలో నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, మజ్జి అప్పారావు, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్, తిరగటి దుర్గారావు, సుభాని, గణేష్ రెడ్డి, మార్గాన రాము, మరిశెట్టి వెంకటేశ్వరరావు, వార్డు ఇంచార్జీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story