Rajahmundry: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ధ్వజం
Rajahmundry: రాష్ట్రంలో మంత్రి లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు.
Rajahmundry: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ధ్వజం
Rajahmundry: రాజమహేంద్రవరం, రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్కు రాజ్యాంగం అమలవుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తొక్కుతోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తు వేధిస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి , మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రభుత్వ వైఫల్యం పై ద్వజమెత్తారు. ప్రభుత్వ అన్యాయాలపై , అక్రమాలపై, స్థానిక ప్రజా ప్రతినిధుల అక్రమాల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్లో పి జి ఆర్ ఎస్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి
మాజీ ఎంపీ భరత్ రామ్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఆనం తరం ఆయన మీడియాతో మాట్లాడుతూ , నగరంలో జరిగిన కల్తీ పాల ఘటనలో బాల, బాలికలు మెరుగైన, ఆధునిక వైద్య చికిత్సలు అందక మృత్యు ఒడిలోకి జారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వ పెద్దలు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించారని,
ఈరోజు వరకు సరైన వైద్యం అందించడం లేదని బాలల బాధితుల కుటుంబాలు పిల్లలను రక్షించుకొలేక ఆర్థికంగా సతమాతమవుతున్నాయని, ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోవడం దారుణం అన్నారు. బాలల కుటుంబాలకు ఇప్పటివరకు మూడున్నర లక్ష ల రూపాయలు ఖర్చయిందని ఇంతవరకు ప్రభుత్వం రియంబర్స్మెంట్ కూడా చేయలేదని , వైద్యం చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు కూడా బెదిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ స్పందించాలన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పీతారామకృష్ణ అక్రమ అరెస్టు..
రాష్ట్రంలోనూ , రాజమండ్రిలోను రాజ్యాంగం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, తమ పార్టీ లో క్రియాశీలకంగా ఉండే బీసీ నాయకుడు పీతారామకృష్ణ పై అక్రమంగా పి డి చట్టం ప్రయోగించారని భరత్ మండిపడ్డారు. ఇదంతా ఈవీఎం ఎమ్మెల్యే కుట్ర లో భాగమేనని, అతని ఒత్తిడి మేరకు పోలీసులు
నియంత్రత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నగర టీడీపీలో 40 వ వార్డు పరిసరాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయని, కొట్టిన వారి పెట్టిన కేసును పోలీసులు నమోదు చేశారని దెబ్బలు తిన్న వారిని అరెస్టు చేశారని భరత్ విమర్శించారు. ఇదేంటి అన్యాయమని అడిగినా పీ తారామకృష్ణను గతంలో కొట్టేసిన కేసులను అడ్డం పెట్టుకొని పి డియాక్ట్ అమలు చేయడం దారుణం అన్నారు.
కోర్టుకు వెళ్లి రౌడీ షీట్ పై స్టే ఆర్డర్ తెచ్చుకున్నారనీ అయినప్పటికీ పోలీస్ లు అరెస్టు చేయడం ఈవీఎం ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడమే ప్రధాన బాధ్యతని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ నియంత్రత్వ ధోరణి కి నిదర్శనం అన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆన్నారు.
ప్రజల సహకారస్పూర్తి ని దెబ్బతీస్తున్న ఇన్నీస్ పేట కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తీరు..
ప్రజల సహకార స్ఫూర్తికి, ప్రజల ఆర్థిక భద్రతకు , అభివృద్ధికి తోడ్పడవలసిన ఇన్నిస్పేట కోపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ కోళ్ల బాబు తీరు ఆర్బిఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందని భరత్ విమర్శించారు. కోపరేటివ్ బ్యాంకు 1964 చట్టం నుండి ఏకపక్ష , శాశ్వత చైర్మన్ పదవి కి దారి తీసే 1995 మాక్ చట్టం పరిధిలోకి బలవంతంగా ప్రజలను, సభ్యులను ఒప్పించేలాగా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ మార్పు ఆర్బిఐ నిబంధనలకు విరుద్ధమని,
కోళ్ల బాబు అనే వ్యక్తి ఇప్పటికే గత 20 సంవత్సరాలుగా బ్యాంకును పట్టుకొని వేలాడుతున్నాడని ఇతని చర్యలు వెనుక ఈవీఎం ఎమ్మెల్యే కులాభిమానం ఉందని ఆరోపించారు. ఆర్యపురం బ్యాంకు ను మరొక ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు పాలిస్తున్నాడని, నగరంలోని కోపరేటివ్ బ్యాంకులను తమ ఆస్తులుగా పంచేసుకున్నారని విమర్శించారు. ఆర్.బి.ఐ నిబంధనల ప్రకారము ఏ సభ్యుడైన, ఏ డైరెక్టర్ అయినా 8 లేదా 10 సంవత్సరాల మించి ఉండకూడదని స్పష్టంగా ఉందని
ఈ నిబంధనలను మ్యాక్ చట్టంను అడ్డం పెట్టుకొని కోళ్ల బాబు ముఠా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు చెందిన రూ .140 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయని ,ఆర్థిక భద్రతకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోపరేటివ్ అర్బన్ బ్యాంకులు వారి వంశపారంపర ఆస్తుల ఏమిటి ? దీనిపై ప్రజా పోరాటం చేస్తామన్నారు.
డ్రెజింగ్ తో ఇసుక దోపిడీ..
బోట్ మెన్ సొసైటీల పేరుతో గా మన్ బ్రిడ్జి వద్ద రాత్రి పగలు తేడా లేకుండా డ్రెజింగ్ బోట్లతో ఈవీఎం ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దోపిడీ చేస్తున్నారని భరత్ విమర్శించారు. గామన్ బ్రిడ్జి ప్రమాదంలో పడుతోందని, స్థానిక స్థానిక మత్స్యకారులకు ఉపాధి కోల్పోతున్నారని, స్థానికులకు ఆరోగ్యపరంగా రోగాల బారిన పడుతున్నారని , ఈ వి ఎం ఎమ్మెల్యే అని ఎందుకు గెలిపించుకున్నామని క్షోభ పడుతున్నారని అన్నారు.
ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇసుక దోపిడీ జరుగుతోందని , సామాన్య ప్రజలకు ఇసుక లభ్యం కావడం లేదని విమర్శించారు ఈవీఎం ఎమ్మెల్యే ధన దాహం కు అంతం లేదని, గామన్ బ్రిడ్జి రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఆరోగ్యపరంగా ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ధర్నాలు చేస్తామని, అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తామని భరత్ హెచ్చరించారు. ఇసుక దోపిడీ కి సంబంధించి సాక్ష్యాధారాలను జిల్లా కలెక్టర్ కు అందజేశామని చెప్పారు.
ముస్లిం ల షాదీ ఖానా నిర్మాణాన్ని అడ్డుకున్న ఈ వి ఎం ఎమ్మెల్యే..
ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు వ్యతిరేకం అని, తన హయాంలో వీరభద్ర నగరం వద్ద పాత కబేలా స్థలంలో స్థలంలో ముస్లింలకు 2500 చదరపు గజాలు( 50 సెంట్లు) షాదీ ఖానాకు కేటాయించానని రూ.50 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రస్తుతం ఈవీఎం ఎమ్మెల్యే ముస్లిములకు కేటాయించలేదని, పనులు కూడా పనులు కూడా ప్రారంభించలేదని, ప్రస్తుత ఎంపీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. షాదీ ఖానా నిర్మాణం జరిగేంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఎంపీ వెంట వైసీపీ నాయకులు, మహిళలు కార్యకర్తలు ఉన్నారు.




