Rajahmundry: ఓట్ల తొలగింపు కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి!
Rajahmundry: రాజమహేంద్రవరంలో ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ సమీక్ష. వైసిపి కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రారంభం.
Rajahmundry: ఓట్ల తొలగింపు కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి!
Rajahmundry: ఎన్నికల కమీషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున రాజమహేంద్రవరం నగరంలోని ఓటర్లు తమ ఫారాలను బిఎల్ఓలకు అందచేసారో ? లేదో పరిశీలన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్గాని భరత్ రామ్ సూచించారు. ఏ ఒక్క ఓటు తొలగించకుండా వైసిపి డివిజన్‌ల ఇన్‌చార్జ్‌లు, బిఎల్ఎలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వైసిపి సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నందున అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
నగరంలోని 41, 45, 47, 50 డివిజన్లలో సోమవారం విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. ఫారాలు పూర్తి చేసే విషయంలో ఓటర్లకు బిఎల్ఓలతో పాటు వైసిపి శ్రేణులు, ఇన్‌చార్జ్‌లు సహకరించాలని సూచించారు. నగరంలో గత వైసిపి ప్రభుత్వ హాయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు, ఓటర్లకు వివరించడానికి ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామని తెలిపారు. అన్ని డివిజన్లలో క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడం ద్వారా త్వరలో జరిగే నగరపాలక సంస్థ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలకు గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు. పార్టీ కార్యక్రమం జరిగినప్ప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించి రావాలని పేర్కొన్నారు. అన్ని డివిజన్ల పర్యటనలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు విస్తృతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జీలు అరుణ్, అల్లు జయరాజ్, తిరగటి దుర్గారావు, గుత్తుల కోటేశ్వరి, కానుబోయిన సాగర్, గణేష్, క్రాంతి, పార్టీ స్థానిక నాయకులు, బిఎల్ఎలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




