Tatipaka: తాటిపాక సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం: బేకరీ దగ్ధం!
Tatipaka: రాజోలు మండలం తాటిపాక సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం. బేకరీ దగ్ధం, రూ.25 లక్షల ఆస్తి నష్టం. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో నిశాంతం.
Tatipaka: తాటిపాక సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం: బేకరీ దగ్ధం!
Tatipaka: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎం. కనక వెంకటేశ్వర్లుకు చెందిన సాయి తేజ బేకరీలో ఉదయం 4:10 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో బేకరీలోని సామాగ్రి, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానిక ఆటో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించడంతో మంటలు చుట్టుపక్కల దుకాణాలకు, భవనాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.
ఈ ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.




