Mamidikuduru: గెద్దాడలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు!

Mamidikuduru: మామిడికుదురు మండలం గెద్దాడ సమీపంలో 216 జాతీయ రహదారి పక్కన భారీగా గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

RAJU, P GANNAVARAM
Published on: 17 Nov 2026 8:17 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: గెద్దాడలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు!

Mamidikuduru: అంబేద్కర్ కోనసీమ జిల్లా గెద్దాడ సమీపంలో 216 జాతీయ రహదారి పక్కన భారీ ఎత్తున గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న ONGC సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజీతో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

జాతీయ రహదారి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందన్న వివరాలు తెలియాల్సి ఉంది.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM