Konaseema: కోనసీమలో కూలిన భారీ చెట్టు.. నిలిచిన రాకపోకలు!

Konaseema: రాజోలు మండలం తాటిపాక మఠం-చాకలిపాలెం రహదారిపై భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 25 Sept 2026 10:10 AM IST
Konaseema
X

Konaseema: కోనసీమలో కూలిన భారీ చెట్టు.. నిలిచిన రాకపోకలు!

Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత రెండు రోజులుగా కురిపిస్తున్న భారీ వర్షానికి రాజోలు మండలం తాటిపాక మఠం – చాకలిపాలెం ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రధాన రహదారిపై చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనులపై వెళ్లే ప్రజలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.

అధికారులు తక్షణమే స్పందించి కూలిన చెట్టును తొలగించడంతో పాటు రహదారిపై రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖల సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE