Mamidikuduru: మామిడికుదురు మండలం నగరంలో ఘనంగా మాసుమే కుమ్ షహదత్!

Mamidikuduru: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో మాసుమే కుమ్ షహదత్ సందర్భంగా ప్రత్యేక మజ్లిస్, మాతం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 19 Aug 2026 10:26 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురు మండలం నగరంలో ఘనంగా మాసుమే కుమ్ షహదత్!

Mamidikuduru: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో ఎనిమిదవ ఇమామ్ హజరత్ ఇమామ్ రజా సోదరి మాసుమే కుమ్ షహదత్ (వర్ధంతి) సందర్భంగా భక్తిశ్రద్ధలతో సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని మంజలే కర్బలా పంజా వద్ద మజిలిస్ నిర్వహించారు.

కర్బలా చరిత్రలో హజరత్ ఇమామ్ హుస్సేన్ పవిత్ర పోరాటంలో ఉపయోగించిన గుర్రం ‘జుల్ జన’ను స్మరించుకుంటూ సంతాప కార్యక్రమం చేపట్టారు. మత ప్రబోధకులు హుసేని రిజ్వీ మజ్లిస్ నిర్వహించారు. అంజుమన్ ఏ పర్వానయే హుస్సేన్ భక్త బృందం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం నగరంలోని పెదపంజీషా వరకు భక్త బృందం మాతం నిర్వహించింది. గుమ్మటం అనంతరం కూడా మాతం కార్యక్రమం కొనసాగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి హజరత్ ఇమామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story