Kadiyam: ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం: విశ్వ శ్రీ ప్రియ

Kadiyam: కడియం మండలం దుళ్ల సర్పంచ్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళంగా ఇస్తానని మాజీ సర్పంచ్ DNR కుమార్తె విశ్వ శ్రీ ప్రియ ప్రకటించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 11 Nov 2026 3:46 PM IST
Kadiyam
X

Kadiyam: ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం: విశ్వ శ్రీ ప్రియ

తూర్పుగోదావరి జిల్లా: కడియం మండలం దుళ్ళ మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ ప్రకటన పై ఆ గ్రామ మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వ శ్రీ ప్రియ స్పందించారు. తన తండ్రి దివంగత నాగేశ్వరరావు,తల్లి రత్నం సర్పంచ్ లుగా పనిచేసి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని విశ్వ పేర్కొన్నారు.

మరో ఏడాదిలో ఎంబీబీఎస్ పూర్తి అవుతుందని నాకు సర్పంచ్ గా అవకాశమిస్తే తల్లిదండ్రుల ఆశయ సాధనకు తాను కృషి చేస్తానని తెలిపారు. సర్పంచ్ అభ్యర్థినిగా తనను ఏకగ్రీవం గా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధికి తన వంతుగా కోటి 50 లక్షలు విరాళం గా ఇస్తామన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL