Amalapuram: మీ-సేవ కేంద్రాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడితే లైసెన్సులు రద్దు!

Amalapuram: అమలాపురం మండలం జనుపల్లి మీ-సేవ కేంద్రాల్లో జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు అధికారి వి. విజయలక్ష్మి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి హెచ్చరించారు.

SURESH, AMALAPURAM
Published on: 14 Nov 2026 8:22 PM IST
Amalapuram
X

Amalapuram: మీ-సేవ కేంద్రాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడితే లైసెన్సులు రద్దు!

Amalapuram: మీ-సేవ కేంద్రాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేస్తాం. నిర్దేశిత ధరలకే సేవలు అందించాలి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. జనుపల్లి మీ-సేవ కేంద్రాల్లో జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వి. విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, నిర్ణీత ధరలకు అందించడమే మీ-సేవ కేంద్రాల ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు అధికారి వి.విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ రోజు అమలాపురం మండలం జనుపల్లి గ్రామంలోని మీ-సేవ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కేంద్రాల్లో అందిస్తున్న సేవలు, నిర్వహిస్తున్న రికార్డులు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం, మీ-సేవ పేరుతో అక్రమాలకు పాల్పడటం వంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. ఇటువంటి ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత కేంద్రాల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రతి మీ-సేవ కేంద్రం నిర్దేశించిన ప్రాంతంలోనే నిర్వహించాలని,సేవలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు పంపాలని సూచించారు. ప్రజలకు అందించే ప్రతి సేవలో పారదర్శకత,జవాబుదారీతనం ఉండాలని నిర్వాహకులకు ఆదేశించారు.ప్రజల ఫిర్యాదులకు కలెక్టరేట్‌లో వేదిక

మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు ఎప్పుడైనా అక్రమాలకు పాల్పడినా,నిర్ణీత ధరలకు మించి డబ్బులు వసూలు చేసినా ప్రజలు నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాన్ని నేరుగా సందర్శించి తమ ఫిర్యాదులు,వినతులను సమర్పించవచ్చని సూచించారు.

ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు ఎలాంటి ఇబ్బందులు, అదనపు ఆర్థిక భారం లేకుండా సక్రమంగా అందేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు.ఆమె వెంట స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ జిల్లా కోఆర్డినేటర్ సువిజయ్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM