Chivatam: రెండేళ్లలో చివటం గ్రామాభివృద్ధికి రూ. 6.82 కోట్లు: మంత్రి!
Chivatam: ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో 'పల్లె పండుగ 2.0' కింద రూ. 1.20 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు.
Chivatam: రెండేళ్లలో చివటం గ్రామాభివృద్ధికి రూ. 6.82 కోట్లు: మంత్రి!
చివటం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని అందులో భాగంగానే గడిచిన రెండేళ్ల కాలంలో ఒక్క చివటం గ్రామాభివృద్ధికే రూ. 6.82 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో 'పల్లె పండుగ 2.0' కార్యక్రమం ద్వారా రూ.1.20 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్లను శుక్రవారం మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగిస్తూ చివటం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సమగ్రంగా వివరించారు.చివటం గ్రామంలో పల్లె పండుగ 1.0 ద్వారా రూ.13 లక్షలతో 2 పనులు, పల్లె పండుగ 2.0 ద్వారా రూ.1.64 కోట్లతో 10 పనులు, రూ.33.28 లక్షల పంచాయతీ నిధులు, రూ.2.45 కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులు, రూ.10 లక్షల మండల ప్రజా పరిషత్ నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
రూ.11.30 లక్షలతో 6 గోకులం షెడ్డులు, చివటం గ్రామం నుండి వడ్లూరు గ్రామం శివారు వరకు రూ.30 లక్షల ఆర్ అండ్ బీ నిధులతో బీటీ రోడ్డు, రూ.1.69 కోట్ల నాబార్డు నిధులతో గ్రామ పరిధి వరకు రోడ్డు వేయడం జరిగిందన్నారు. అదే విధంగా 8 మంది లబ్ధిదారులకు రూ.2.71 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, రూ.2.25 లక్షల విలువైన 2 ఎల్ వోసీ లెటర్లు అందించామన్నారు.




