Nidadavole: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్!

Nidadavole: నిడదవోలులో అర్నబ్ తుఫాను ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 28 Oct 2026 2:24 PM IST
Nidadavole
X

Nidadavole: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్!

Nidadavole: 'అర్నబ్' తుఫాను, భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో, సుబ్బరాజుపేటలో స్వయంగా పర్యటించారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ... ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని, మధ్యాహ్నానికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వాతావరణ శాఖ సమాచారం అందించిందని తెలిపారు.

ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. వ్యవసాయ ఆధారిత నిడదవోలు నియోజకవర్గంలో ప్రతి సీజన్‌లోనూ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం బాధాకరమన్నారు. చేతికొచ్చిన పంట నేలకొరిగి రైతాంగం వేదనకు గురవుతోందని, తానే స్వయంగా పంట నష్టాన్ని పరిశీలించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని వివరించామని, ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తున్నామని తెలిపారు. తుఫాను నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదించి రైతులకు తగిన నష్టపరిహారం అందేలా చొరవ తీసుకుంటామన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సమర్థవంతమైన నాయకత్వంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ప్రభుత్వానికి ఉందన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి దుర్గేష్ భరోసా ఇచ్చారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE