Odalarevu: ఓడలరేవు ప్రమాద మృతుడి కుటుంబానికి మంత్రి నాదెండ్ల పరామర్శ!
Odalarevu: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
Odalarevu: ఓడలరేవు ప్రమాద మృతుడి కుటుంబానికి మంత్రి నాదెండ్ల పరామర్శ!
ఓడలరేవు: అల్లవరం మండలం ఓడలరేవులో నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో జనసేన కార్యకర్త ప్రేమ్ కుమార్ మృతి.మృతుడు ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్.బెండమూర్లంకలోని బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన మంత్రి.కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న నాదెండ్ల మనోహర్.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా నిచ్చారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ బాధిత కుటుంబానికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు.ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్.బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
కష్టకాలంలో కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయని హామీ ఇచ్చారు మంత్రి.ప్రేమ్ కుమార్ మృతిపై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్.ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ అధిక సంఖ్యలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




