Ramachandrapuram: మహిళా పక్షపాతి కూటమి ప్రభుత్వం: మంత్రి వాసంశెట్టి సుభాష్!

Ramachandrapuram: రామచంద్రపురంలో నిర్వహించిన ‘అన్నయ్యతో ఒకరోజు’ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలు మంత్రికి రాఖీలు కట్టారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 28 Aug 2026 6:14 PM IST
Ramachandrapuram
X

Ramachandrapuram: మహిళా పక్షపాతి కూటమి ప్రభుత్వం: మంత్రి వాసంశెట్టి సుభాష్!

రామచంద్రపురం: ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను ముంచెత్తిన మహిళలు. మహిళలకు స్వయంగా గాజులు తొడిగిన మంత్రి సుభాస్. రక్షా బంధన్ (రాఖీ ) పండుగ ను పురస్కరించుకుని రామచంద్రపురం లో ఏర్పాటు చేసిన అన్నయ్యతో ఒకరోజు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్, నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది గా తరలివచ్చిన అక్కా, చెల్లెళ్ళు మంత్రి సుభాష్ కు రాఖీలు కట్టి అన్నయ్య పట్ల తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

మహిళలకు చీరలు, గాజులు, పూలు, మహందీ,స్వీట్లు పంచి ఆశీర్వదించిన మంత్రి సుభాస్, మహిళలందరికీ అరటి ఆకుల లో భోజనాలను స్వయంగా వడ్డించి వాళ్ళ తో కలిసి భోజనం చేసిన మంత్రి సుభాష్, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను మహిళలతో కలిసి మంత్రి సుభాష్ తిలకించారు.

మంత్రి సుభాస్ కామెంట్స్:

రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లకు ఒక పవిత్ర బంధం, అనుబంధం లాంటిది, కట్టిన రాఖీ ఒక తాడు మాత్రం కాదు...ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నం. అన్నగా ఒక భరోసా రక్షణ కల్పించాల్సిన బాధ్యత తనపై ఉంది. తాను ఈ పరిస్థితుల్లో ఉండడానికి సహకరించిన వారందరితో మమేకం కావాలనే ఉద్దేశంతో అన్నయ్యతో ఒకరోజు కార్యక్రమం జరుపుకున్నాం. ఈ మంచి ప్రభుత్వం నిరంతరం మహిళల పక్షపాతి ప్రభుత్వం గా వ్యవహరిస్తోంది.

తల్లికి వందనం,ఉచిత బస్సు సౌకర్యం, మూడు గ్యాస్ సిలిండర్ ల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలుచేస్తుంది. ప్రతీ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. మహిళలు సమానత్వం దాటి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story