Chintoor: చేపల వేటకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే!
Chintoor: గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను రంపచోడవరం కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చింతూరులో పరామర్శించి, నివాళులర్పించారు.
Chintoor: చేపల వేటకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే!
చింతూరు: గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పరామర్శించారు.మృతుల కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చి సంతాపం తెలిపారు.మృతదేహాలను చూసిన ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యాంతమయ్యారు.
మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.మృతదేహాలకు పంచనామా పోస్ట్ మార్టం త్వరగా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసు, వైద్య సిబ్బందికి సూచించారు.మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు.ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితులు రీత్యా కూడా ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు చేయడం మంచిది కాదన్నారు.ఇలాంటి సంఘటనలు పై పోలీసు అధికారులు ప్రజలకు చైతన్యం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎటపాక టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొల్లా పుల్లయ్య, క్లస్టర్ ఇంచార్జీ వల్లభనేని చందు, మండల ప్రధాన కార్యదర్శి కనితిమధు, వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, మువ్వా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మాచినేని రాజేష్ , ఎంపీటీసీ పాయం దేవి గొమ్ము కొత్తగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, యూనిట్ ఇంచార్జి బాచినేని మల్లేశ్వరరావు , నలజాల మదు, పాటి సంపత్, నలజాల శ్రీకాంత్ , విజ్జగిరి రవితేజ , పాలడుగు నవీన్ , స్రవంతి , మాజీ ఎంపీపీ రమాదేవి, మాజీ జెడ్పిటిసి గోడేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.




