Rajahmundry: రాజమండ్రి 8వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

Rajahmundry: రాజమండ్రి 8వ డివిజన్‌లో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అర్హులందరికీ పారదర్శక సంక్షేమమే లక్ష్యమని వెల్లడి.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 July 2026 6:40 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రి 8వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

రాజమండ్రి: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సామాజిక భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 8వ డివిజన్‌లో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అభివృద్ధి మరియు సంక్షేమం రెండు సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతమి జీవ కారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, వై. శ్రీను, కో-క్లస్టర్ వర్రే వినయ్ గాంధీ, బత్తుల కిరణ్ బాబు, అక్కిరెడ్డి ప్రసాద్, బాషా లిమ్రా తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story