Rajahmundry: మోరంపూడి మున్సిపల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే వాసు!
Rajahmundry: రాజమండ్రి మోరంపూడి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు). నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశం.
Rajahmundry: మోరంపూడి మున్సిపల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే వాసు!
Rajahmundry: మోరంపూడి సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ అండ్ హైస్కూల్‌ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా బోధన, మధ్యాహ్న భోజన నిర్వహణను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాలను సందర్శించిన ఎమ్మెల్యే వాసు విద్యార్థుల కోసం వంట ఏ విధంగా చేస్తున్నారు, ఎలాంటి పదార్థాలను వినియోగిస్తున్నారు, ఆహారం నాణ్యత ఎలా ఉంది, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా సంబంధిత సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో ఇటీవల రూ.35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు.
తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన ఎలా జరుగుతోంది, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను తెలుసుకున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పాఠశాలలో ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. పాఠశాలల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.




