Rajamahendravaram: అగ్ని ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే!

Rajamahendravaram: రాజమండ్రి 50వ డివిజన్‌లో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించి, తక్షణ సాయం అందజేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 21 Aug 2026 8:31 AM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: అగ్ని ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే!

Rajamahendravaram: స్థానిక 50వ డివిజన్ దుర్గా నగర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. స్థానిక నాయకుల ద్వారా అగ్ని ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబానికి తక్షణ సాయంగా నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రిని అందజేశారు. అనంతరం అర్బన్ తహసీల్దార్‌తో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story