Amalapuram: మొగళ్ళమూరులో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ!

Amalapuram: అల్లవరం మండలం మొగళ్ళమూరు గ్రామంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 4 Aug 2026 10:16 PM IST
Amalapuram
X

Amalapuram: మొగళ్ళమూరులో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ!

అమలాపురం: అల్లవరం మండలం మొగళ్ళమూరులో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.

రైతుల ముఖాల్లో ఆనందం చూశాకే కూటమి ప్రభుత్వానికి నిజమైన తృప్తి.రైతే రాజు అని నమ్మే కూటమి ప్రభుత్వం,వారి ఆస్తులకు భద్రత కల్పిస్తూ పూర్తి పారదర్శకతతో భూహక్కు పత్రాలను అందిస్తోందని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు తెలిపారు.

అల్లవరం మండలంలోని మొగళ్ళమూరు గ్రామంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులైన రైతులకు ఎమ్మెల్యే ఆనందరావు చేతుల మీదుగా అధికారిక పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎదురైన భూసమస్యలు, వివాదాలకు తెరదించుతూ,ప్రతి రైతుకు వారి భూమిపై పూర్తి హక్కులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వం, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనామోద పాలన, మరియు మంత్రి నారా లోకేష్ ముందస్తు కార్యాచరణల ఫలితంగానే నేడు రెవెన్యూ వ్యవస్థలో పారదర్శక మార్పులు సాధ్యమయ్యాయని కొనియాడారు.

పాస్ పుస్తకాలు అందుకున్న రైతుల ముఖాల్లోని సంతోషమే ఈ ప్రభుత్వానికి అసలైన బలమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మిగిలిన రెవెన్యూ సమస్యలను కూడా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు (తాసిల్దార్,విఆర్ఓలు),స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద ఎత్తున గ్రామ రైతులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story