Amalapuram: అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు ఇంటింటి ప్రచారం!

Amalapuram: అమలాపురం 22వ వార్డులో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

SURESH, AMALAPURAM
Published on: 15 Sept 2026 5:42 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు ఇంటింటి ప్రచారం!

అమలాపురం: అమలాపురం పట్టణం 22 వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు. ఈ రోజు అమలాపురం పట్టణ రూపురేఖలు మారుస్తూ, సంక్షేమాన్ని ప్రతి ఇంటి ముంగిట నిలుపుతున్న శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు మంగళవారం 22వ వార్డులో నిర్వహించిన "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం" ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమయ్యారు.

వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శిస్తూ, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు మరియు చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను,ప్రజల అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. హామీలను నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నందుకు ఎమ్మెల్యే వార్డు ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అధికారం అంటే పాలించడం కాదు,ప్రజల గుండెల్లో నమ్మకాన్ని గెలవడమే అని, అమలాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కూటమి కార్యకర్తలు,నాయకులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM