Amalapuram: అమలాపురంలో జారో జనరిక్ ఫార్మసీ ప్రారంభం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు
Amalapuram: అమలాపురం కాలేజ్ రోడ్‌లో జెనివిస్ రెమిడీస్ జారో ఫార్మసీ ప్రారంభం. 60 శాతం తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు లభిస్తాయన్న ఎమ్మెల్యే ఆనందరావు.
Amalapuram: అమలాపురంలో జారో జనరిక్ ఫార్మసీ ప్రారంభం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జెనివిస్ రెమిడీస్ జారో ఫార్మసీ జనరిక్ మెడిసిన్ స్టోర్‌ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.జనరిక్ మందులపై ఉన్న అపోహలను వీడి,తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అమలాపురం కాలేజ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన జెనివిస్ రెమిడీస్ జారో ఫార్మసీ బ్రాంచ్‌ను ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు.సాధారణ బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సుమారు 60 శాతం తక్కువ ధరలో లభిస్తాయని తెలిపారు.
దేశ ప్రధాని,రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జనరిక్ మందుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.ఈ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 45 బ్రాంచ్‌లు ప్రారంభించామని, త్వరలో కొత్తపేట,పాశర్లపూడి, ముమ్మిడివరంలోనూ సేవలు విస్తరిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, పలువురు ప్రజాప్రతినిధులు,సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




