Amalapuram: కూటమి నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆనందరావు కృతజ్ఞతలు
Amalapuram: అమలాపురం మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో రేయింబవళ్లు శ్రమించిన కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కృతజ్ఞతలు తెలిపారు.
Amalapuram: కూటమి నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆనందరావు కృతజ్ఞతలు
అమలాపురం: అమలాపురం పట్టణ మున్సిపాల్ మరియు జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రేయింబవళ్లు శ్రమించి,ప్రతి ఓటరును చైతన్యపరిచిన తెలుగుదేశం,జనసేన, భాజపా నాయకులకు మరియు కార్యకర్తలకు ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఎమ్మెల్యే ఆనంద్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.
కూటమి గెలుపే ధ్యేయంగా మీరు చూపిన ఉత్సాహం,మీరు చేసిన అలుపెరగని పోరాటం మనమందరం కలిసి చేసిన ఈ సామూహిక కృషి వాళ్ళ వచ్చే ఫలితాలలో అఖండంగా కూటమి విజయంగా రూపాంతరం చెందాలని మనసారా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కొనియాడారు.




