Amalapuram: తీరప్రాంతాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే ఆనందరావు
Amalapuram: ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఎస్. యానాం బీచ్‌లో నిర్వహించిన స్వచ్ఛ సాగర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు శ్రమదానం చేశారు.
Amalapuram: తీరప్రాంతాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే ఆనందరావు
Amalapuram: ఈ రోజు ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యకార సంక్షేమ సమితి మరియు ఇన్యాయ్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి 21 వరకు చేపడుతున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ వారోత్సవాలు ఎస్. యానాం బీచ్ నందు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
ఈ పారిశుధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని, బీచ్ పరిసరాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసి శ్రమదానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మన భూమండలానికి జీవనాధారమైన సముద్రాలు మరియు తీరప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో మత్స్యకారుల సంక్షేమానికి,వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.మడ అడవుల పెంపకం, తీరప్రాంతాల్లో ప్లాస్టిక్ నివారణ వంటి కార్యక్రమాలు తుఫానుల నుండి తీర గ్రామాలను కాపాడుకోవడానికి ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తీరప్రాంత పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై,సముద్రంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా అవగాహన పెంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు,స్థానిక మత్స్యకార సంక్షేమ సమితి నాయకులు,అధికారులు మరియు మత్స్యకార సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




