Allavaram: జనసేన నేత గుర్రం కృష్ణ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆనందరావు!

Allavaram: బెండమూర్లంకలో జనసేన యువనాయకుడు గుర్రం కృష్ణ (GK) జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు. శాలువాతో ఘన సత్కారం, శుభాకాంక్షలు.

SURESH, AMALAPURAM
Published on: 18 Sept 2026 11:35 PM IST
Allavaram
X

Allavaram: జనసేన నేత గుర్రం కృష్ణ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆనందరావు!

అల్లవరం: అల్లవరం మండలం,బెండమూర్లంక గ్రామంలో జనసేన నాయకులు గుర్రం కృష్ణ (GK)స్వగృహం నందు నిర్వహించిన వారి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్రం కృష్ణ ని శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జనసేన యువనాయకుడు జికె ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో వర్ధిల్లాలని,ప్రజలకు మరిన్ని సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు,అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు,నల్లా శ్రీధర్,కంకిపాటి గోపి,కూటమి కార్యకర్తలు,నాయకులు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జీ.కే కి శుభాకాంక్షలు తెలిపారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM