Kothapeta: యువ క్రికెటర్ అభినవ్‌కు ఎమ్మెల్యే బండారు అభినందన
Kothapeta: ఢిల్లీ బౌలింగ్ అకాడమీకి ఎంపికైన ఆత్రేయపురం మండలం ర్యాలి యువ ఫాస్ట్ బౌలర్ కొత్తపల్లి అభినవ్‌ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు.
Kothapeta: యువ క్రికెటర్ అభినవ్‌కు ఎమ్మెల్యే బండారు అభినందన
Kothapeta: ఢిల్లీ బౌలింగ్ అకాడమీకి ఎంపికైన ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన పదహారేళ్ళ యువ ఫాస్ట్ బౌలర్ కొత్తపల్లి అభినవ్ ను వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయస్థాయి క్రికెట్ శిక్షణకు కొత్తపేట నియోజకవర్గానికి చెందిన యువకుడు ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఆన్లైన్ ట్రయల్స్ లో అద్భుత ప్రతిభ కనబరిచి ఢిల్లీ బౌలింగ్ అకాడమీకి ఎంపిక అవ్వడం ప్రతిభకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కొత్తపేట నియోజకవర్గ ఖ్యాతిని, ర్యాలి గ్రామ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలని అభినవ్ ను ఆయన ఆశీర్వదించారు.




