Atreyapuram: ఆత్రేయపురం మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారం!
Atreyapuram: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆత్రేయపురం మండలంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం.
Atreyapuram: ఆత్రేయపురం మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారం!
Atreyapuram: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు వేసే ఓటు నేరుగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు చెందుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.
ఆత్రేయపురం మండలంలో శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, అనంతరం జడ్పిటిసి అభ్యర్థి గూడపాటి శ్రీనివాస్, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలను కూటమి ఇచ్చిందని ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ చెప్పాం... చేస్తున్నాం.... చేస్తూనే ఉంటాం.... అని జరుగుతున్న అభివృద్ధిని నినదించారు. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ రోడ్డు మీద వెళ్తున్నాడు కదా అని ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారని అయితే తన పాలనను కూల్చివేతలతో మొదలుపెట్టి, ఆరాచకాలతో కొనసాగించి, ఆర్థిక విధ్వంసంతో ముగించాడని దుయ్యబట్టారు.
జగన్ చేసిన దుర్మార్గాలకు ప్రజలు విసుగుచెంది ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో 164 సీట్లతో అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు. నవరత్నాలు నవ మోసాలుగా జగన్ పాలన సాగిందన్నారు. రైతు భరోసా 20 వేలు జమ చేస్తానని చెప్పి జగన్ కేవలం రాష్ట్రం వాటాగా రూ.7500 మాత్రమే జమ చేసి రైతుల్ని మోసం చేశాడని గుర్తు చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చాక చెప్పింది చెప్పినట్లుగా ఏడాదికి రూ.20వేలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం ప్రతి అన్నదాత ఖాతాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద రూ.7 వేలు జమ చేయడం జరిగిందన్నారు.
ఆత్రేయపురం మండలం అభివృద్ధికి గత రెండున్నర సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేపట్టమన్నారు. లొల్ల లాకుల పునర్నిర్మాణానికి నిధులు సాధించామన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. వసంత వాడ వద్ద అమర జీవి జలధార పథకం కింద వాటర్ హెడ్ నిర్మాణం జరుగుతుందన్నారు.
గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, డ్రైనేజీల నిర్మాణం జరిగిందన్నారు. ఈ రెండున్నర ఏళ్ల లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు.
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, స్థానిక సంస్థల్లో జడ్పిటిసి ఎంపిటిసి ల్లో కూటమి అభ్యర్థులు గెలుపు ద్వారా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో నడవాలన్నారు. మండలంలోని ప్రతి ఎంపీటీసీ స్థానం, జడ్పిటిసి స్థానంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.




