Razole: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆస్తులపై అసత్య ప్రచారం!
Razole: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ రిటర్నులపై జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, అఫిడవిట్‌లో అన్ని వివరాలు ఉన్నాయని రాజోలు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Razole: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆస్తులపై అసత్య ప్రచారం!
Razole: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదాయ పన్ను రిటర్నులపై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పేర్కొన్నారు.
2024 సాధారణ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో చట్టప్రకారం తన ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారని ఆయన తెలిపారు. ఎన్నికల అఫిడవిట్, ఆదాయ పన్ను రిటర్నులను పరిశీలించకుండా తప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో అసత్య సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని దేవ వరప్రసాద్ అన్నారు. వాస్తవాలను తెలుసుకుని మాత్రమే ప్రజా వేదికలపై వ్యాఖ్యలు చేయాలని ఆయన సూచించారు.
Next Story




