Rajolu: శంకరగుప్తం డ్రెయిన్ పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

Rajolu: రాజోలు నియోజకవర్గంలోని కేశనపల్లిలో జరుగుతున్న శంకరగుప్తం డ్రెయిన్ పూడికతీత పనులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు.

PRABHU, RAZOLE
Published on: 22 Jun 2026 9:32 AM IST
Rajolu
X

Rajolu: శంకరగుప్తం డ్రెయిన్ పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా: రాజోలు నియోజకవర్గంలోని కేశనపల్లిలో కొనసాగుతున్న శంకరగుప్తం డ్రెయిన్ పూడికతీత పనులను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు ఆయన వెంట పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు పనుల పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు. డ్రెయిన్ ఒక వైపున మొత్తం 8 కిలోమీటర్ల మేర పూడికతీత చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 2 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా వేగవంతంగా కొనసాగించి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.

పనుల నాణ్యతతో పాటు వేగాన్ని కూడా కొనసాగించాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. శంకరగుప్తం డ్రెయిన్ పూడికతీత పూర్తయితే పరిసర ప్రాంతాల్లో నీటి పారుదల వ్యవస్థ మెరుగుపడి రైతులకు, స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story